News4th Apr 12:55 PMSunil Byrisetty1 min read

చిన్నారులపై వేధింపులు.. కంప్యూటర్ ఆపరేటర్‌కు దేహశుద్ధి!

కడప జిల్లా బద్వేల్ ఏవీఆర్ స్కూల్‌లో విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్యకు దేహశుద్ధి చేశారు. ఆరో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థులపై కంప్యూటర్

చిన్నారులపై వేధింపులు.. కంప్యూటర్ ఆపరేటర్‌కు దేహశుద్ధి!
కడప జిల్లా బద్వేల్ ఏవీఆర్ స్కూల్‌లో విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్యకు దేహశుద్ధి చేశారు. ఆరో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థులపై కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో స్కూలు వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు పెంచలయ్యకు దేహశుద్ధి చేశారు. చిన్నపిల్లలతో ఈ విధంగాప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పెంచలయ్యను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పెంచలయ్యను చితకబాదుతున్న వీడియో వైరల్‌గా మారింది.
Teacher Misbehaving
6th Class Student
Kadapa
AVR School
పెంచలయ్య
కడప జిల్లా బద్వేల్
Scroll for the next article