News6th Sep 11:03 AMSunil Byrisetty1 min read

పండుగ వాతావరణంలో గురుపూజోత్సవం

భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబ

పండుగ వాతావరణంలో గురుపూజోత్సవం
భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల అభిప్రాయాలతో ఏర్పాటుచేసిన వాల్ బోర్డులను సీఎం, మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో తూర్పుగోదావరి జిల్లా రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీచ‌ర్‌ రమ్యసుధ, కడప జిల్లా పోరుమామిళ్లలో ఏపీఎస్ఎస్ డీసీ స్కిల్ హబ్ కోఆర్డినేటర్ పనిచేస్తున్న కే.వెంకట్రావులకు వేదికపై సీఎం చంద్రబాబునాయుడు పక్కనే కూర్చొనే అవకాశం కల్పించి సమున్నతంగా గౌరవించారు. అనంతరం 175 మందికి సీఎం, మంత్రి లోకేష్ చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రదానం చేశారు. వారిని శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రం, మెడల్, జ్ఞాపికతో పాటు రూ.20వేల నగదు బహుమతిని అందజేశారు.
Andhra Pradesh Education
Teachers Day
Teachers Day Celebrations
Sarvepalli Radhakrishnan
Chandrababu Naidu
Nara Lokesh
ఏపీ ఉపాధ్యాయులు
ఉత్తమ ఉపాధ్యాయులు
ఉపాధ్యాయ అవార్డులు
విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Scroll for the next article