News16th Aug 11:48 AMSunil Byrisetty1 min read
విజయవాడలో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
విజయవాడలో టీచర్లు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ-2025 విజేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు ఈ ర్యాలీ కొనసాగి
విజయవాడలో టీచర్లు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ-2025 విజేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. టీచర్లు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. తమపై విమర్శలు చేసే వారికి బుద్ధి ప్రసాదించాలని వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ర్యాలీకి టీచర్లు హాజరయ్యారు. డీఎస్సీ-2025 విజేతల ఎంపికపై వైసీపీ చేస్తున్న విమర్శలపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే సహించబోమని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ఇప్పటికే కర్నూలు, తిరుపతి సహా పలు జిల్లాల్లో డీఎస్సీ విజేతల ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి.