News8th Aug 01:09 PMSunil Byrisetty1 min read

రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల సంఘీభావ ర్యాలీలు

మెగా డీఎస్సీ 2025కి మద్దతుగా టీచర్లు సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కడప, అనంతపురం నుంచి కర్నూలుకు భారీగా ఉపాధ్యాయులు చేరుకున్నారు. ఆత్మగౌరవ ర్యాలీతో కదం తొక్కుతున్న టీచర్లు వై

రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల సంఘీభావ ర్యాలీలు
మెగా డీఎస్సీ 2025కి మద్దతుగా టీచర్లు సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కడప, అనంతపురం నుంచి కర్నూలుకు భారీగా ఉపాధ్యాయులు చేరుకున్నారు. ఆత్మగౌరవ ర్యాలీతో కదం తొక్కుతున్న టీచర్లు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ నినాదాలు చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారంపై భగ్గుమన్నారు. తమ నియామకాలపై దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కొండారెడ్డి బురుజు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు మెగా డీఎస్సీ టీచర్లు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. వాస్తవాలు వివరించినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు. ఉపాధ్యాయ నియామకాలపై కుట్రలు చేయొద్దని ప్లకార్డులు ప్రదర్శించారు.
Andhra Pradesh
YSRCP
Mega DSC 2025
Teachers
Teacher Recruitment
Kurnool
Kadapa
Anantapur
కొండారెడ్డి బురుజు
సంఘీభావ ర్యాలీ
ఆత్మగౌరవ ర్యాలీ
డీఎస్సీ నియామకాలు
విద్య
Scroll for the next article