Education30th Dec 05:35 PMSunil Byrisetty1 min read

విద్యార్థులు తక్కువగా ఉన్నారని బడులు మూసేయొద్దు

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారన్న కారణం చూపుతూ పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్ర

విద్యార్థులు తక్కువగా ఉన్నారని బడులు మూసేయొద్దు
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారన్న కారణం చూపుతూ పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథ రెడ్డి, ఎల్.సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదుగురు విద్యార్థులలోపు గల ప్రాథమిక పాఠశాలలను వేరొక పాఠశాలలో, 30 మంది లోపు విద్యార్థులు గల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను సమీప ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలోను, 50 మంది విద్యార్థులు లోపు గల ఉన్నత పాఠశాలలను వేరొక ఉన్నత పాఠశాలలో విలీనం చేయడానికి ప్రతిపాదనలు కోరుతున్నారని తెలిపారు. ఇటువంటి ఏకపక్ష నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఏ ఒక్క పాఠశాలలను మూసివేయమని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట మార్చడం సరైనది కాదని గుర్తు చేవారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు అన్న పేరుతో 9620 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ చాలా పాఠశాలల్లో ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులతోనే నడుస్తున్నాయన్నారు. చాలా ఉన్నత పాఠశాలల్లో కొన్ని సబ్జెక్టులకు బోధించే ఉపాధ్యాయులే లేరన్నారు.
Andhra Pradesh
Education
Government Schools
School Merger
Student Strength
Teachers Union
ఉపాధ్యాయ సంఘం
ప్రాథమిక పాఠశాలలు
ఉన్నత
Scroll for the next article