Sports10th Mar 09:14 AMSunil Byrisetty1 min read

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 విజేత‌గా భార‌త్‌.. ఫైన‌ల్‌లో న్యూజిలాండ్ పై ఘ‌న విజ‌యం.. ముచ్చ‌ట‌గా మూడోసారి..

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 విజేత‌గా భార‌త్ నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఛాంపియ‌న్స్ ట్రోఫీని ముచ్చ‌ట

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 విజేత‌గా భార‌త్‌.. ఫైన‌ల్‌లో న్యూజిలాండ్ పై ఘ‌న విజ‌యం.. ముచ్చ‌ట‌గా మూడోసారి..
ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 విజేత‌గా భార‌త్ నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఛాంపియ‌న్స్ ట్రోఫీని ముచ్చ‌ట‌గా మూడోసారి ముద్దాడింది. ఈ క్ర‌మంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీని అత్య‌ధిక సార్లు గెలిచిన జ‌ట్టుగా టీమ్ఇండియా చ‌రిత్ర సృష్టించింది. గ‌తంలో 2002లో శ్రీలంక‌తో క‌లిసి సంయుక్త విజేత‌గా నిల‌వ‌గా, 2013లో ధోని నాయ‌క‌త్వంలో గెలిచింది. 252 ల‌క్ష్యాన్ని భార‌త్ 49 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (76; 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ బాదాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ (48; 62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), కేఎల్ రాహుల్ (34 నాటౌట్; 33 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) లు రాణించారు. శుభ్‌మ‌న్ గిల్ (31; 50 బంతుల్లో 1 సిక్స్‌), అక్ష‌ర్ ప‌టేల్ (29; 40 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. విరాట్ కోహ్లీ (1) విఫ‌లం అయ్యాడు. కివీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ సాంట్న‌ర్, బ్రాస్‌వేల్ లు చెరో రెండు వికెట్లు తీయ‌గా, కైల్ జేమీసన్, ర‌చిన్ ర‌వీంద్ర లు త‌లా ఓ వికెట్ తీశారు.
ICC
Championstrophy2025
India vs New zealand
ఐ సి సి
ఛాంపియన్స్ట్రోఫీ2025
ఇండియా vs న్యూజిలాండ్
Scroll for the next article