Countries9th Mar 06:36 PMSunil Byrisetty1 min read
మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్న ట్రంప్
మూడో ప్రపంచ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో మైనింగ్ ఒప్పందానికి ఉక్రెయిన్ నిరాకరించడం యుద్ధానికి దారి తీయొచ్చని అభిప్రాయపడ్డారు. రష్యా, ఉక్
మూడో ప్రపంచ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమతో మైనింగ్ ఒప్పందానికి ఉక్రెయిన్ నిరాకరించడం యుద్ధానికి దారి తీయొచ్చని అభిప్రాయపడ్డారు.
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుుద్ధాన్ని ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందన్నారు.
లక్షలాది మంది మరణించకూడదని అమెరికా భావిస్తోందన్నారు.
అమెరికా జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దకపోతే కనుక మూడో ప్రపంచ యుద్ధం జరగక తప్పదని అనిపిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ మీద రష్యా దాడుల పరిస్థితి అదుపులోకి వస్తే ఊరట కలిగిస్తామని సూచించారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని సూచించానన్నారు.
ఇప్పటికే చాలా ఆలస్యమైందని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.