News15th Jun 12:06 PMSunil Byrisetty1 min read
అవినీతికి పాల్పడితే.. అంతు చూస్తా!
ఏపీలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కుండ బద్దలు కొట్టారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, ఆరోపణ
ఏపీలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కుండ బద్దలు కొట్టారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, ఆరోపణలు నిజమైతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. IVRS సర్వేపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వివిధ పథకాల అమలు తీరుపై ప్రజాభిప్రాయాలను వెల్లడించారు. ఏడాది పాలనలో ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలపై సమీక్షలో చర్చించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా సంతృప్తి వ్యక్తమైందని సీఎంకు అధికారులు వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపైనా సాంకేతిక ఆడిటింగ్ జరపాలని సీఎం వారిని ఆదేశించారు.