News8th Nov 10:58 AMSunil Byrisetty1 min read
ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్రమంత్రి రామ్మోహన్
ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్యలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టి సారించారు. రాత్రి పొద్దుపోయేవరకు విమానాశ్రయంలోనే గడిపారు.బెంగళూరు విమానాశ్రయంలో కార్యక్రమం పూర్తి చేసుకు
ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్యలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టి సారించారు. రాత్రి పొద్దుపోయేవరకు విమానాశ్రయంలోనే గడిపారు.బెంగళూరు విమానాశ్రయంలో కార్యక్రమం పూర్తి చేసుకుని సాయంత్రం ఢిల్లీ వచ్చిన మంత్రి రాత్రి 7 నుంచి అర్థరాత్రి వరకు ఏటీసీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంతోపాటు పలు చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉదయం నుంచే అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సాంకేతిక సమస్యలతో తన మలేషియా పర్యటనను రామ్మోహన్ నాయుడు రద్దు చేసుకున్నారు. పలుచోట్ల సమస్యలు తలెత్తి విమానాల ఆలస్యంతో పర్యటన రద్దు చేసుకున్న కేంద్రమంత్రి పరిష్కారంపై దృష్టి సారించారు.