Spiritual12th Oct 10:26 AMSunil Byrisetty1 min read

ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రతకు ‘టెక్నాలజీ కవచం’

భక్తిభావానికి ప్రతీకగా నిలిచే విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల భద్రత, సౌకర్యవంతమైన దర్శనం, రద్దీ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞ

ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రతకు ‘టెక్నాలజీ కవచం’
భక్తిభావానికి ప్రతీకగా నిలిచే విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల భద్రత, సౌకర్యవంతమైన దర్శనం, రద్దీ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారుతోంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం రూపొందించిన దసరా–2026 ఐటీ ఏర్పాట్లలో భాగంగా దర్శన క్యూలైన్ల నుంచి అన్నప్రసాద వితరణ కేంద్రాలు, పార్కింగ్‌ ప్రాంతాలు, ఘాట్‌ రోడ్ల వరకు వివిధ సాంకేతిక వ్యవస్థలను వినియోగించే విధానాలను రూపొందించారు. భక్తుల రాకపోకలను పర్యవేక్షించడం, రద్దీని అంచనా వేయడం, వాహనాల ప్రవేశాన్ని నియంత్రించడం, తప్పిపోయిన పిల్లల ఆచూకీ గుర్తించడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం సహాయకారిగా నిలవనుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే సందర్భాల్లో రద్దీ పరిస్థితులను అంచనా వేయడానికి AI FRS కెమెరా ఆధారిత దర్శన సమయ అంచనా వ్యవస్థ రూపొందించారు. దర్శన క్యూలైన్ల వద్ద ఏర్పాటు చేసే కెమెరాల నుంచి లభించే సమాచారం ఆధారంగా భక్తుల కదలికలను పర్యవేక్షించడం, ప్రవేశం–నిష్క్రమణ సమాచారాన్ని విశ్లేషించడం, దర్శనానికి పట్టే సమయాన్ని అంచనా వేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం.
Scroll for the next article