News27th Sep 04:44 PMSunil Byrisetty1 min read

టెక్నాలజీని మంచి కోసం వాడితే అభివృద్ధి – చెడు కోసం వాడితే శిక్ష

టెక్నాలజీని సమాజం అభివృద్ధి కోసం వాడితే మంచి ఫలితాలు వస్తాయని, కానీ దానిని చెడు కోసం వాడితే శిక్ష తప్పదని ఈగల్ ఐజీ ఆకె రవికృష్ణ సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవార

టెక్నాలజీని మంచి కోసం వాడితే అభివృద్ధి – చెడు కోసం వాడితే శిక్ష
టెక్నాలజీని సమాజం అభివృద్ధి కోసం వాడితే మంచి ఫలితాలు వస్తాయని, కానీ దానిని చెడు కోసం వాడితే శిక్ష తప్పదని ఈగల్ ఐజీ ఆకె రవికృష్ణ సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించేలా, కులాల మధ్య విభేదాలు రేపేలా పోస్టులు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ విభాగం నిఘా ఉంచిందని తెలిపారు. ఇటీవలే గడ్డం శివప్రసాద్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పై తప్పుడు పోస్టులు పెట్టినందుకు సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వివరించారు. అలాగే షేర్ మార్కెట్ వాట్సాప్ గ్రూపుల్లో నిర్లక్ష్యంగా జాయిన్ అవ్వకూడదని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. కొంతమంది అత్యాశతో మోసగాళ్ల వలలో పడుతున్నారని, ఈ తరహా గ్రూపులు ఆర్థిక నష్టాలకు కారణమవుతున్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు రూపొందించి ఆర్థిక లాభాలు పొందడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై కూడా చర్యలు తప్పవని తెలిపారు.
Technology
Cyber Crime
Social Media
Awareness
Digital safety
Chandrababu naidu
CyberSecurity
Online fraud
IG Ravi Krishna
Law and order
చట్టవ్యవస్థ
మార్ఫింగ్ వీడియోలు
షేర్ మార్కెట్ మోసాలు
ఆర్థిక నష్టాలు
Scroll for the next article