Mobiles23rd May 05:01 PMSunil Byrisetty1 min read
కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్!
స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ టెక్నో మరో అప్డేట్ ఇచ్చింది. కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్‌ను మే 29న విడ
స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ టెక్నో మరో అప్డేట్ ఇచ్చింది.
కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్‌ను మే 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లో మెరుగైన సిగ్నల్ కోసం ప్రత్యేక ఫీచర్‌లు ఉన్నాయి.
పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ స్లీక్ డిజైన్‌తో, కెమెరా బంప్‌తో ఆకట్టుకుంటుంది.
ఈ ఫోన్ 1080 x 2436 పిక్సల్స్ రిజల్యూషన్‌తో ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
మీడియాటెక్ MT6978 SoC (మీడియాటెక్ డైమెన్సిటి 7300 SoC) చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
8GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ 64MP ప్రైమరీ కెమెరాతోపాటు, సెకండరీ కెమెరా, సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
అదనపు వివరాలు తెలియాల్సి ఉంది.