Crime27th Aug 09:48 AMSunil Byrisetty1 min read

చదువుకోమంటే చంపేశాడు.. కన్నతల్లిపై కొడుకు కర్కశత్వం!

విజయనగరం జిల్లాలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. డోలపేటకు చెందిన ముంజేటి స్పందన 16 ఏళ్ల కుమారుడికి చక్కగా చదువుకోమని మందలించారు. కొడుకు విద్యాబుద్దుల కోసం ఆ తల్లి పడిన తపనే ఆమె పాలి

చదువుకోమంటే చంపేశాడు.. కన్నతల్లిపై కొడుకు కర్కశత్వం!
విజయనగరం జిల్లాలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. డోలపేటకు చెందిన ముంజేటి స్పందన 16 ఏళ్ల కుమారుడికి చక్కగా చదువుకోమని మందలించారు. కొడుకు విద్యాబుద్దుల కోసం ఆ తల్లి పడిన తపనే ఆమె పాలిట మృత్యువవుతుందని ఊహించలేదు. యాక్షన్ సినిమాలు, ఫైటింగ్ మొబైల్ గేమ్ లను వ్యసనంగా మార్చుకున్న ఆ మైనర్ కొడుకు మనసంతా మాఫియాగా మారిపోయిందని ఆ తల్లి కనిపెట్టలేకపోయింది. బాగా చదువుకుంటే మంచి కెరీర్ వస్తుందని చెబుతున్న తల్లిపై ద్వేషం పెంచుకున్న కొడుకు ఏకంగా హత్యకు ఒడిగట్టాడు. 16 ఏళ్లు కూడా నిండని కన్న కొడుకే ఈ పనికి పాల్పడ్డాటం సమాజాన్ని తలదించుకునేలా చేసింది. తల్లి మందలించిందని కోపం పెట్టుకున్న కొడుకు తల్లిపై దాడి చేసి ఏకంగా 16 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి, ఆమె శరీరారన్ని ఇంటి పక్క చెరువులో పడేశాడు. తర్వాత ఇంట్లోని బంగారం తీసుకొని ముంబై పారిపోయి మాఫియా గ్యాంగ్‌లో చేరాలని ఆలోచన చేసి స్నేహితుడితో కలిసి తిరుపతి వెళ్తూ అక్కడ దొరికిపోయాడు. రాజాం పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ సమాజంలో విలువలు ఏ రకంగా దిగజారిపోతున్నాయో, పసి మనసులను మొబైల్, సినిమాలు ఏ విధంగా విషపూరితం చేస్తున్నాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh
Vizianagaram
Mother Son Incident
Juvenile Crime
Teen Crime
Rajam Police
Murder Case
Family Tragedy
Mobile Games
Violent Movies
హింసాత్మక సినిమాలు
బాలల ప్రవర్తన
జువెనైల్ జస్టిస్
క్రైమ్ న్యూస్
Scroll for the next article