Telangana17th Sep 05:03 PMSunil Byrisetty1 min read

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తన పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)' అని

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ
తెలంగాణలో మరో రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తన పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)' అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ బీసీల తలరాత మారే దినంగా తాను భావిస్తున్నానన్నారు. తెలంగాణలో మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందన్న ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Telangana Politics
Teenmaar Mallanna
Telangana Rajyadhikara Party
TRP
New Political Party
BC Community
Hyderabad
Congress Rebel MLC
తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పరిణామాలు
సెప్టెంబర్ 17
బీసీ సాధికారత
Scroll for the next article