Spiritual21st Nov 02:12 PMSunil Byrisetty1 min read

పల్లకీ సేవలో ఆక‌ట్టుకున్న తీన్‌మార్ డ్ర‌మ్స్‌

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం ఉదయం పల్లకీ సేవలో తీన్‌మార్ డ్ర‌మ్స్‌, రింగ్ ఫిజ‌న్‌, ట్రైబల్ డాన్స్, కోలాటాల ప్రదర్శనలు భ‌క్తుల‌ను ఎంత

పల్లకీ సేవలో ఆక‌ట్టుకున్న తీన్‌మార్ డ్ర‌మ్స్‌
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం ఉదయం పల్లకీ సేవలో తీన్‌మార్ డ్ర‌మ్స్‌, రింగ్ ఫిజ‌న్‌, ట్రైబల్ డాన్స్, కోలాటాల ప్రదర్శనలు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 15 కళాబృందాలలో దాదాపు 300 మంది కళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. నూజివీడుకు చెందిన అమరావతి డ్రమ్స్ రాంబాబు బృందం తీన్‌మార్ డ్ర‌మ్స్‌తో భ‌క్తుల‌ను విశేషంగా ఆకర్షించారు. మొత్తం 15 మంది క‌ళాకారులు లయబద్ధంగా డ్రమ్ములు వాయిస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. త‌ణుకుకు చెందిన అంబిక డ్యాన్స్ అకాడ‌మికి చెందిన బృందం 20 మంది క‌ళాకారుల రింగ్ ఫ్యూజ‌న్ నృత్యం, నూజివీడుకు చెందిన లాలేశ్వర రావు బృందంలోని 35 మంది క‌ళాకారుల‌ చెక్కభజనలు, కొవ్వూరుకు చెందిన శ్రీ శివరామకృష్ణ బృందం ట్రైబల్ డ్యాన్స్ భ‌క్తుల‌ను క‌నువిందు చేశాయి. తిరుపతికి చెందిన హరిత బృందం వివిధ దేవ‌తామూర్తులు, తిరుపతికి చెందిన డాక్టర్ మురళీకృష్ణ బృందం నవదుర్గలు, అష్ట‌ల‌క్ష్మీల వేషధారణ భ‌క్తుల‌ను క‌నువిందు చేశాయి. చిత్తూరుకు చెందిన వాణిశ్రీ బృందం, ప్రొద్దుటూరుకు చెందిన కృష్ణవేణి బృందం, రైల్వే కోడూరుకు చెందిన సుజన బృందాల‌ కోలాటాలు అల‌రించాయి.
TTD
Hindu Dharma Projects
Tiruchanur
Padmavathi Ammavaru
Kartika Brahmotsavam
Pallaki Seva
Teenmar Drums
Ring Fusion Dance
Tribal Dance
Kolatam
చెక్కభజనలు
హరిత బృందం
నవదుర్గలు
అష్టలక్ష్మీలు
Scroll for the next article