News9th May 09:22 AMSunil Byrisetty1 min read
తెలంగాణలా.. ఏపీలోనూ సన్నబియ్యం!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ తరహాలో ఏపీలో చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సుదీర్ఘంగా ప్రతిపాదనలో ఉన్న సన్నబియ్యం పథకం ఏపీలో కార్యరూపం దాల్చబోతోంది. జూన్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ తరహాలో ఏపీలో చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
సుదీర్ఘంగా ప్రతిపాదనలో ఉన్న సన్నబియ్యం పథకం ఏపీలో కార్యరూపం దాల్చబోతోంది. జూన్ 12 నుంచి సన్నబియ్యం పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. సన్నబియ్యం పంపిణీని దశలవారీగా చేపట్టాలని నిర్ణయించింది. తొలుత 41 వేల ప్రభుత్వ పాఠశాలలు, 4 వేల సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. తర్వాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.