Politics26th Oct 05:09 PMSunil Byrisetty1 min read
జనసేనతో పొత్తా? మాకొద్దన్న బీజేపీ!
జనసేనను ప్రజలు తెలంగాణ వ్యతిరేక పార్టీగా చూస్తున్నారని, ఇప్పుడు మనం జనసేనతో పొత్తు పెట్టుకుంటే మనల్ని కూడా తెలంగాణ వ్యతిరేకులుగా భావిస్తారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అంతర్గత
జనసేనను ప్రజలు తెలంగాణ వ్యతిరేక పార్టీగా చూస్తున్నారని, ఇప్పుడు మనం జనసేనతో పొత్తు పెట్టుకుంటే మనల్ని కూడా తెలంగాణ వ్యతిరేకులుగా భావిస్తారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అంతర్గత సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. అంతే కాకుండా పార్టీ అంతర్గత సమావేశంలో తెలంగాణ బీజేపీ నాయకులు జాతీయ నాయకులకు తెగేసి చెప్పారు. పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి మాట్లాడినా పెద్దగా ప్రయోజనం లేదని, ఇక్కడి ప్రజలను ప్రభావితం చేయదని మరికొందరు అభిప్రాయపడ్డారు. పొత్తు లేకుండా పరోక్షంగా మద్దతు తీసుకుందామని, పొత్తు పెట్టుకుంటే మన పార్టీకి పుట్టగతులు ఉండవని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చివరికి పొత్తు గురించి నిర్ణయాన్ని హైకమాండ్‌కు వదిలేద్దామని చెప్పగా వరంగల్–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇద్దామని, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానంలో మనం జనసేన మద్దతు తీసుకుందామని కొందరు చెప్పినట్టు సమాచారం.