Telangana28th May 01:48 PMSunil Byrisetty1 min read

బోగస్ కార్డులపై ఫోకస్!

తెలంగాణ ప్రభుత్వం,రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బోగస్ కార్డులు, అనర్హులపై ఫోకస్ పెట్టింది. జిల్లా అధికారులు రేషన్ డీలర్ల వారీగా జాబితాలో అనర్హుల

బోగస్ కార్డులపై ఫోకస్!
తెలంగాణ ప్రభుత్వం,రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బోగస్ కార్డులు, అనర్హులపై ఫోకస్ పెట్టింది. జిల్లా అధికారులు రేషన్ డీలర్ల వారీగా జాబితాలో అనర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలెట్టారు. అలాంటి వారి పేర్లు తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా రేషన్‌ బియ్యం తీసుకోని వారి జాబితా తయారు చేయాలని ఆదేశించడంతో జిల్లా రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టారు. పెళ్లి చేసుకొని వెళ్లిన వారు, మరణించిన వారు, స్థానికంగా లేని వారిని గుర్తించి, ఏరివేత చేపడుతున్నారు. వచ్చే నెలలో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించడంతో బియ్యం పక్కదారి పట్టుకూడదనే ఉద్దేశంతో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు.
Telangana
CM Revanthreddy
Bogus Ration Cards Being Removed
Ineligible Names Deleted
రేషన్ డీలర్ల వారీగా జాబితాలో అనర్హుల గుర్తింపు ప్రక్రియ
బోగస్ కార్డులు
Scroll for the next article