Telangana16th Jul 09:17 AMSunil Byrisetty1 min read
తెలంగాణలో బోనాల జాతర నేటి నుంచి
ఆషాఢ మాసం బోనాల జాతర తెలంగాణలో ఘనంగా మొదలవుతోంది. జులై 16వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో జరిగే తొల
ఆషాఢ మాసం బోనాల జాతర తెలంగాణలో ఘనంగా మొదలవుతోంది. జులై 16వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో జరిగే తొలిపూజతో ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా మొదలవుతాయి. ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉదయం లంగర్‌హౌస్‌లో ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో తొట్టెలను గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయానికి సమర్పిస్తారు.