Telangana5th Sep 12:31 PMSunil Byrisetty1 min read
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. ఆశావహులు వీరే
తెలంగాణ మంత్రివర్గంలో కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత కొత్తగా ఎవరొస్తారనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రివ
తెలంగాణ మంత్రివర్గంలో కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత కొత్తగా ఎవరొస్తారనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు కోసం ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉండగా మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రేసులో మహేశ్ కుమార్ గౌడ్, విజయశాంతి, గడ్డం ప్రసాద్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారమే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి.