News20th Apr 11:54 AMSunil Byrisetty1 min read
ఢిల్లీ కన్నా హైదరాబాద్ బెటర్.. డ్రై పోర్ట్ పెడతాం!
ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జపాన్ పర్యటనలో ఆయన మాట్లాడుతూ కాలుష్యంతో ఢిల్లీ నగరం స్థంభించే పరిస్థ
ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
జపాన్ పర్యటనలో ఆయన మాట్లాడుతూ కాలుష్యంతో ఢిల్లీ నగరం స్థంభించే పరిస్థితి ఉంటే.. మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
అందుకే హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేయాలని చెబుతున్నానన్నారు.
మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని చెప్పారు.
తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు.
ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చని, మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవాలని కోరారు.
సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో మీకు తెలుసని చెప్పారు.