Telangana10th Jul 10:33 AMSunil Byrisetty1 min read
మనవడు అడిగితే సీఎం అయినా పూరీలు వేయాల్సిందే!
పిల్లల గారాబం ముందు తాత తగ్గాల్సిందే. అది సీఎం అయినా, ఇంకెవరైనా. తాజాగా రేవంత్ రెడ్డి కూడా మనవడి కోసం గరిట పట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడి కోసం స్వయంగా వంటగదిలో
పిల్లల గారాబం ముందు తాత తగ్గాల్సిందే. అది సీఎం అయినా, ఇంకెవరైనా. తాజాగా రేవంత్ రెడ్డి కూడా మనవడి కోసం గరిట పట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడి కోసం స్వయంగా వంటగదిలోకి వెళ్లి పూరీలు వండిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన మనవడు రేయాన్ష్ కోసం గంటె పట్టి, నూనెలో పూరీలు వేయిస్తూ, సరదాగా మాట్లాడుతూ కనిపించారు. మనవడితో ఆయన చిట్‌చాట్ కూడా చాలా సరదాగా సాగింది. అమ్మమ్మ కోసం పూరీలు కావాలని మనవడు అడగడం మరింత ఆసక్తికరంగా మారింది.