Telangana26th Oct 04:00 PMSunil Byrisetty1 min read

మహారాష్ట్రలో ఇరు సీఎంల భేటీ

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎంతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. బ్యార

మహారాష్ట్రలో ఇరు సీఎంల భేటీ
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎంతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. బ్యారేజ్‌ను 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు తెలంగాణ ప్రతిపాదిస్తోందని వివరించారు. గతంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించింది. అయితే 148 మీటర్ల ఎత్తుతో ఆశించిన స్థాయిలో నీటిని తరలించడం సాధ్యం కాదని రేవంత్ పేర్కొన్నారు. 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పించేందుకు తెలంగాణ ప్రయత్నాలు చేస్తోంది. బ్యారేజ్ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావంపై ప్రధానంగా చర్చలు జరిపారు.
Scroll for the next article