Telangana30th Dec 11:45 AMSunil Byrisetty1 min read
శ్రీవారి సేవలో తెలంగాణ సీఎం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు అర్చకులు అందించారు. త
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు అర్చకులు అందించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలు వైకుంఠ ఏకాదశి శోభతో వెలిగిపోతున్నాయి. భక్తులు వేకువజామున 2 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు తరలివచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. మొదట వీఐపీలకు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి దర్శనం కల్పించగా, సాధారణ భక్తులకు ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల గిరులు, ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి.