Politics13th Aug 03:58 PMSunil Byrisetty1 min read

బీజేపీ తండ్రి అయితే, జగన్, చంద్రబాబు కొడుకులు!

కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. ఏపీలో పర్యటించిన ఆయన విజయవాడలోని రాష్ట్ర కాంగ్

బీజేపీ తండ్రి అయితే, జగన్, చంద్రబాబు కొడుకులు!
కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. ఏపీలో పర్యటించిన ఆయన విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో మాట్లాడారు. రాహుల్ గాంధీ కుటుంబం మీద బిజెపిది కక్ష సాధింపు అని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కమిషన్ బిజెపి అడుగు జాడల్లో నడుస్తోందన్నారు. ఏపీకి బిజెపి తండ్రి, జగన్ చంద్రబాబు కొడుకులు అని ఎద్దేవా చేశారు. ఏపీ పాలిటిక్స్ కల్లుదుకాణం దగ్గర కూచునే అన్నదమ్ముల్లా ఉంటుందని విమర్శించారు. బిజెపి కల్లు దుకాణం అయితే.. అన్నదమ్ములు చంద్రబాబు, జగన్ అన్నారు. రాష్ట్ర విభజనకు లెటర్లు ఇచ్చింది చంద్రబాబు, జగన్ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
Andhra Pradesh news
Jagga Reddy
CEC
BJP
RSS
Rahul Gandhi
Congress
YS Jagan
Chandrababu Naidu
బీజేపీ విమర్శలు
జగ్గారెడ్డి వ్యాఖ్యలు
ఆంధ్రరత్న భవన్
Scroll for the next article