Telangana27th Jul 11:51 AMSunil Byrisetty1 min read

సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన, బలమైన ఆహార సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనం

సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన, బలమైన ఆహార సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం మధిర మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన సభ కు ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన, బలమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాలకు ఈ బ్రేక్ ఫాస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Telangana
Bhatti Vikramarka
Centralized Community Kitchen
Government Schools
Student Nutrition
Midday Meal
Breakfast Scheme
Congress Government
ప్రజా సంక్షేమం
తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థుల సంక్షేమం
ఆహార భద్రత
సంక్షేమ పథకాలు
Scroll for the next article