News22nd Apr 10:55 AMSunil Byrisetty1 min read
మూడొందలకే ఇంటర్నెట్.. తెలంగాణ ప్రభుత్వం యోచన!
తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్ చౌకగా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ‘భారత్ నెట్’ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్
తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్ చౌకగా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
‘భారత్ నెట్’ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు 2025 చివరి నాటికి రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రణాళిక రూపొందిస్తోంది.
అందుకోసం 12,751 గ్రామ పంచాయతీలను ఆప్టిక్ ఫైబర్ కేబుల్‌తో అనుసంధానం చేయనుంది.
ఈ మేరకు T-ఫైబర్ పనులను త్వరగా పూర్తిచేసి, 2028 నాటికి రూ.500 కోట్ల ఆదాయం పొందాలని ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ భావిస్తోంది.
దీంతో ప్రైవేట్ ప్రొవైడర్లు కూడా ధరలు తగ్గించాల్సి ఉంటుంది.