Telangana8th Dec 03:01 PMSunil Byrisetty1 min read

ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు షాక్

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్రపాలిని తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఏప్రిల్ 9న ఇచ్చిన

ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు షాక్
ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్రపాలిని తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఏప్రిల్ 9న ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై హైకోర్టు స్టే ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులలను తాత్కాలికంగా నిలిపివేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్, చీఫ్ జస్టిస్ అపారేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్లు, క్యాట్ ఆదేశాలు రెండు తెలుగు రాష్ట్రాల అడ్మినిస్ట్రేషన్‌కు అడ్డంకిగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమ్రపాలి (2010 బ్యాచ్) ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించబడినప్పటికీ, తెలంగాణలోనే కొనసాగాలని కోరుతూ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలు అసమానంగా అమలు అయ్యాయని, ఆమె ప్రాతినిధ్యాన్ని కేంద్రం మెకానికల్‌గా తిరస్కరించిందని ఆమె వాదించింది.
Andhra Pradesh Cadre
Telangana High Court
IAS Amrapali
CAT Orders
Cadre Allocation
Telangana Administration
Court
తెలంగాణ క్యాడర్ కేసు
ఆమ్రపాలి పిటిషన్‌
హైకోర్టు కీలక నిర్ణయం
Scroll for the next article