Telangana27th Jul 04:17 PMSunil Byrisetty1 min read
హైడ్రాపై హైకోర్టు సీరియస్.. ఏకంగా చీఫ్ పైనే గురి
తెలంగాణలో ప్రభుత్వ భూములు, చెరువు భూముల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రాకు హైకోర్టు షాకిచ్చింది. లోతుకుంట భూముల వ్యవహారం, గతంలో అనేక కోర్టు ధిక్కరణ కేసులు కూడా ఉండటం సీ
తెలంగాణలో ప్రభుత్వ భూములు, చెరువు భూముల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రాకు హైకోర్టు షాకిచ్చింది. లోతుకుంట భూముల వ్యవహారం, గతంలో అనేక కోర్టు ధిక్కరణ కేసులు కూడా ఉండటం సీరియస్ అయింది. హైడ్రా చీఫ్ రంగనాథ్ ను తప్పించాలని ఆదేశించింది. ఆయన స్థానంలో మరో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన భూ వ్యవహారంలో... అది ప్రభుత్వ భూమి అంటూ హైడ్రా, రెవెన్యూ అధికారులు వెళ్లి పరిశీలించారు. గతంలోనే అనేక సార్లు అది ప్రైవేటు భూమేనంటూ కోర్టు ఆర్డర్స్ ఉన్నా, హైడ్రా అధికారులు ఆ భూమిలోకి వెళ్లవద్దని స్పష్టమైన ఆర్డర్స్ ఉన్నా.. వెళ్లటంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు కంటెప్ట్ కోర్టులో ఉండగానే, మరో కంటెప్ట్ చేయటంతో కోర్టు ఏకంగా హైడ్రా చీఫ్ నే మార్చాలని కోర్టు ఆదేశించింది.