Telangana3rd Oct 12:49 PMSunil Byrisetty1 min read

తెలంగాణలో.. తెగ తాగేశారు!

తెలంగాణలో దసరా సీజన్ రికార్డ్ మద్యం అమ్మకాలు నమోదు చేసింది. దసరా పండుగ, గాంధీ జయంతి ఒకేరోజు రావడంతో తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. పండుగకు ముందు కేవలం రె

తెలంగాణలో.. తెగ తాగేశారు!
తెలంగాణలో దసరా సీజన్ రికార్డ్ మద్యం అమ్మకాలు నమోదు చేసింది. దసరా పండుగ, గాంధీ జయంతి ఒకేరోజు రావడంతో తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. పండుగకు ముందు కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 419 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం మద్యం దుకాణాలకు సెలవు ప్రకటించింది. అదే రోజు దసరా పండుగ కూడా ఉండటంతో, మందుబాబులు ఒకరోజు ముందుగానే పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేశారు. ఈ కారణంగా అక్టోబర్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, లిక్కర్ మార్ట్‌ల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది. సెప్టెంబర్ 30న అత్యధికంగా రూ. 333 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఆ తర్వాత అక్టోబర్ 1వ తేదీన మరో రూ. 86 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. వాస్తవానికి సెప్టెంబర్ 26 నుంచే రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు రెట్టింపైనట్లు అధికారులు పేర్కొన్నారు.
Telangana
Dasara 2025
Liquor Sales
Excise Department
Gandhi Jayanti
Wine Shops
Festival Rush
Record Alcohol Sales
మద్యం కొనుగోలు
లిక్కర్ మార్కెట్
రాష్ట్ర రికార్డు
Scroll for the next article