News1st May 10:52 AMSunil Byrisetty1 min read

తెలంగాణలో సమ్మె సైరన్.. బస్సులు బంద్!

పలు డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు సైరన్ మోగించింది. మే 7 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలు రౌ

తెలంగాణలో సమ్మె సైరన్.. బస్సులు బంద్!
పలు డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు సైరన్ మోగించింది. మే 7 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ మే డే స్పూర్తితో ఆర్టీసీ సమ్మెకు సిద్దమయ్యామన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమ్మెకు ముందు ఆర్టీసీ కార్మికులు మే5 న కార్మిక కవాతు చేపడుతున్నామన్నారు. సీఎం త్వరగా ఆర్టీసీ విలీనాన్ని చేపట్టాలని కోరారు. ఆర్టీసీలో ప్రజాపాలన చేయాలని కోరుతున్నామన్నారు. ప్రైవేటీకరణకు మూలమైన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం కొని నడపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసి కార్మికులను ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో ఆర్టిసి విలీన ప్రక్రియ చేపట్టాలని తేల్చిచెప్పారు. 16 వేల మంది రిటైర్ అయిన ఖాళీలను భర్తీ చేయాలన్నారు. సీఎం ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై తమ వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు.
RTC Strike
CM Revanth reddy TSRTC
RTC Unions
RTC workers
ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలు
తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు సైరన్
ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న
Scroll for the next article