Telangana28th Aug 09:26 AMSunil Byrisetty1 min read
తెలంగాణ ఆర్టీసీలో సెల్ఫ్ టికెటింగ్!
ఆర్టీసీ బస్సుల్లో ఆటోమేషన్ తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌స్టాప్ బస్సు సర్వీసుల్లో ‘సెల్ఫ్ టికెటింగ్’ విధానాన్ని అందుబాటు
ఆర్టీసీ బస్సుల్లో ఆటోమేషన్ తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌స్టాప్ బస్సు సర్వీసుల్లో ‘సెల్ఫ్ టికెటింగ్’ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. బస్సు ఎక్కే ముందు టికెట్ కోసం వేచి చూసే అవసరం లేకుండా, ప్రయాణికులే స్వయంగా టికెట్ కొనుగోలు చేసే విధానాన్ని రూపొందించింది. ప్రయాణికులు బస్సు ఎక్కే ముందు డోర్ వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేయాలి. ఎక్కే, దిగే స్టాప్‌ల వివరాలను నమోదు చేసి, ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించగానే టికెట్ జనరేట్ అవుతుంది. ఆ డిజిటల్ టికెట్‌ను డ్రైవర్‌కు చూపిస్తే సరిపోతుంది. పైలెట్ ప్రాజెక్టుగా తొలుత నల్గొండ-హైదరాబాద్ మార్గంలో అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ విధానం విజయవంతమైతే, సెప్టెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని మిగతా అన్ని నాన్‌స్టాప్ రూట్లలోనూ విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.