Telangana29th Sep 10:58 AMSunil Byrisetty1 min read

తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్‌ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని పేర

తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్‌ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని పేర్కొంది. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. అక్టోబర్‌ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. పోలింగ్‌ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలతోపాటు నవంబర్‌ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.
Telangana
Local Body Elections
Election Commission
MPTC
ZPTC
Panchayat Elections
Election Schedule
Polling Dates
Election Results
తెలంగాణ ఎన్నికలు
మండల పరిషత్‌
జిల్లా పరిషత్‌
పంచాయతీ రాజ్‌
స్థానిక సంస్థలు
Scroll for the next article