Telangana14th Aug 12:03 PMSunil Byrisetty1 min read
ఈ నెలలోనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్?
తెలంగాణలో ఈ నెలలోనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ అధి
తెలంగాణలో ఈ నెలలోనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ నెల 18న కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ పై చర్చ జరుపనున్నారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ప్రకటించనున్నారని సమాచారం.
ఈ నెల 20లోపు జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అలాగే 22లోపు ఎంపీటీసీలకు రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంది.