Telangana5th Sep 06:06 PMSunil Byrisetty1 min read
తెలంగాణలో డేటా సెంటర్.. టీసీఎస్ రెడీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ పెట్టుబడిని సాధించింది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరో సంస్థ హైపర్‌వాల్ట్ భాగస్వామ్యంతో భారీ ఏఐ-రెడీ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ పెట్టుబడిని సాధించింది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరో సంస్థ హైపర్‌వాల్ట్ భాగస్వామ్యంతో భారీ ఏఐ-రెడీ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా రూ.70,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం 264 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అందులో 1 గిగావాట్ సామర్థ్యంతో కూడిన అల్ట్రా-స్కేల్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఇక్కడ నిర్మించనున్నారు. దశలవారీగా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనుండగా దాదాపు 7 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మరోవైపు ఇప్పటికే ఏపీలో విశాఖ దగ్గర గూగుల్ డేటా సెంటర్ రాబోతున్న విషయం తెలిసిందే.