Telangana2nd Nov 12:38 PMSunil Byrisetty1 min read
తెలంగాణలో చిత్రం.. టీచర్ సస్పెండ్
తెలంగాణలో నిర్వహించిన మద్యం టెండర్లలో పాల్గొన్న మహిళా టీచరుకు షాక్ ఎదురైంది. చేస్తున్న ఉద్యోగం పోయింది. మహబూబ్ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాంనగర్ బాలికల పాఠశాల పీఈటీగా పని చేస్తు
తెలంగాణలో నిర్వహించిన మద్యం టెండర్లలో పాల్గొన్న మహిళా టీచరుకు షాక్ ఎదురైంది. చేస్తున్న ఉద్యోగం పోయింది. మహబూబ్ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాంనగర్ బాలికల పాఠశాల పీఈటీగా పని చేస్తున్న పుష్ప.. మద్యం టెండర్లో పాల్గొని, ధర్మపూర్ వైన్ షాప్ దక్కించుకుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి టెండర్లకు అర్హులు కాదని నిబంధనలు ఉండటంతో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన విద్యా శాఖ అధికారులు.. పీఈటీ పుష్పను సస్పెండ్ చేశారు. దీంతో వైన్ షాప్ వచ్చింది కానీ ప్రభుత్వ ఉద్యోగం ఊడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.