Telangana17th Jul 12:50 PMSunil Byrisetty1 min read

కొత్త పెన్షన్లు ఆగస్టు 15 నుంచి

తెలంగాణలో కొత్త పెన్షన్లపై కీలక అప్డేట్ వచ్చింది. ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటనలో ఆమె మాట్లాడారు. అర

కొత్త పెన్షన్లు ఆగస్టు 15 నుంచి
తెలంగాణలో కొత్త పెన్షన్లపై కీలక అప్డేట్ వచ్చింది. ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటనలో ఆమె మాట్లాడారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణిస్తే వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఈ ప్రకటనతో కొత్త లబ్ధిదారులు భారీగా చేరనున్నారు.
Telangana
Seethakka
Single Women Pension
Social Welfare
Pension Scheme
August 15
సామాజిక సంక్షేమం
లబ్ధిదారులు
ఆగస్టు 15
రాష్ట్ర వార్తలు
తెలుగు వార్తలు
బ్రేకింగ్ న్యూస్
Scroll for the next article