Telangana8th Dec 03:49 PMSunil Byrisetty1 min read
డ్యూటీకి లేటా.. గంట కొట్టగానే మెసేజ్!
తెలంగాణలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఆలస్యంగా వచ్చే వారికి పాఠశాల విద్య శాఖ అధికారులు షాక్ ఇవ్వనున్నారు. గంట ఆలస్యమైతే ఉపాధ్యాయులకి మెసేజ్ వెళ్లనుంది
తెలంగాణలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఆలస్యంగా వచ్చే వారికి పాఠశాల విద్య శాఖ అధికారులు షాక్ ఇవ్వనున్నారు. గంట ఆలస్యమైతే ఉపాధ్యాయులకి మెసేజ్ వెళ్లనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల అధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలల్లో విద్యార్థులతో పాటు, సిబ్బంది హాజరు కోసం ఫేషియల్ రిక్నగేషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్)ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎఫ్ఆర్ఎస్ అమలు మూలంగా పాఠశాలలకు రెగ్యులర్ గా హాజరుకాని 3 విద్యార్థుల పేరెంట్స్, వారంలో ఎక్కువ రోజులు హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లవాడు పాఠశాలకు హాజరు కాలేదని తెలుపుతూ మెసేజ్ లను పంపిస్తున్నారు. దీంతో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకి వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల హాజరు 70 నుంచి 75 శాతం వరకు ఉంటుండగా.. టీచర్లు అటెండెన్స్ సుమారు 80 నుంచి 85 శాతం వరకు ఉంటుంది. విద్యార్థులు పాఠశాలకు హాజరు కాకపోతే వారి తల్లిదండ్రులకు మెసేజ్ లు పంపిస్తున్నట్టుగానే.. పాఠశాలకు అనుమతి లేకుండా హాజరుకానీ ఉపాధ్యాయులకు కూడా మెసేజ్ లు పంపించాలనే యోచనలో పాఠశాల విద్య శాఖ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.