News9th Jul 05:29 PMSunil Byrisetty1 min read
యువకుడి ప్రాణాన్ని కాపాడిన 'టెలీమానస్'
ఆత్మహత్య యత్నానికి పాల్పడిన 21 ఏళ్ల యువకుడిని 'టెలీమానస్ ' సహాయ కేంద్రం కాపాడింది. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా విజయవాడ సర్వజన ఆసుపత్రిలో నడుస్తోన్న టెలీమానస్ (TELEMANAS హెల్ప్ లైన్ 144
ఆత్మహత్య యత్నానికి పాల్పడిన 21 ఏళ్ల యువకుడిని 'టెలీమానస్ ' సహాయ కేంద్రం కాపాడింది. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా విజయవాడ సర్వజన ఆసుపత్రిలో నడుస్తోన్న టెలీమానస్ (TELEMANAS హెల్ప్ లైన్ 14416 నంబరు)కు బాధితుడిని నుంచి కాల్ రాగా వైద్యులు, కౌన్సెలర్లు వెంటనే కౌన్సెలింగ్ ద్వారా ఆ యువకుడిని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి పంపించి, చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. అక్కడి వైద్యులు యువకుడికి వాంతులు చేయించడంతో కోలుకున్నాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన 21 ఏళ్ల యువకుడు వ్యక్తిగత సమస్యలతో ఎలుకల మందు తాగాడు. కాసేపటి తరువాత ఆందోళనతో అంతర్జాలంలో లభించిన టెలీమానస్ సహాయ కేంద్రాన్ని ఫోన్ ద్వారా సంప్రదించాడు. కౌన్సెలర్, వైద్యులు ఫోన్ ద్వారా నచ్చచెబుతూ, ఏమీ కాదని ధైర్యం చెబుతూ అతడి ద్వారానే తండ్రితో కూడా మాట్లాడారు. అప్పటివరకు ఈ విషయం తెలియని అతని తండ్రికి పరిస్థితిని వివరించిన టెలీమానస్ వైద్యులు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి పంపించేలా చర్యలు తీసుకున్నారు. అక్కడ ఉత్తమ వైద్యాన్ని అందించడంతో యువకుడు వెంటనే కోలుకున్నాడు. టెలీమానస్ సిబ్బంది తండ్రి, కుమారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. విజయవాడలోని టెలీమానస్ కన్సల్టెంట్ డా. శ్రీకాంత్, కౌన్సెలర్, ప్రొద్దుటూరులోని టెలీమానస్ పరిధిలోని డిఎంహెచ్‌పి కేంద్రం సైక్రియాటిస్ట్ డా. కవితాప్రసన్న, క్లినికల్ సైకాలజిస్ట్ కె. శిల్ప, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ పి. భాస్కర్ చొరవను మంత్రి సత్య కుమార్ యాదవ్ అభినందించారు.