Politics4th Mar 04:01 PMSunil Byrisetty1 min read
బీసీలు అంటేనే టీడీపీ...టీడీపీ అంటేనే బీసీలు
బీసీలు అంటేనే టీడీపీ... టీడీపీ అంటేనే బీసీలు అని రాష్ట్ర బీసీ, ఈబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒకరిని వ్యాపార వేత్తన
బీసీలు అంటేనే టీడీపీ... టీడీపీ అంటేనే బీసీలు అని రాష్ట్ర బీసీ, ఈబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు.
ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒకరిని వ్యాపార వేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.
బీసీలతో ఓటేయించుకుని వారిని గత ప్రభుత్వం మోసగించిందని మంత్రి సవిత మండిపడ్డారు.
శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం బీసీల కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
* ఏపీ బీసీ కార్పొరేషన్ ద్వారా 2024-25 ఆర్థిక సంబంధించి స్వయం ఉపాధి పథకాల కోసం రూ. 896.71 కోట్లు విడుదల చేశాం
* బీసీ ‘ఏ’ కార్పొరేషన్ ద్వారా రూ.276.24 కోట్లు, బీసీ ‘బీ’ కార్పొరేషన్ ద్వారా రూ.243.01 కోట్లు, బీసీ ‘డీ’ కార్పొరేషన్ ద్వారా రూ.284.82 కోట్లు, బీసీ ‘ఈ’ కార్పొరేషన్ ద్వారా రూ.92.72 కోట్లు...ఇలా మొత్తం రూ. 896.71 కోట్లు వెచ్చించాం
* బీసీ ‘ఏ’ కార్పొరేషన్ కింద 18 కార్పొరేషన్లు, బీసీ ‘బీ’ కార్పొరేషన్ కింద 17 కార్పొరేషన్లు, బీసీ ‘డీ’ కింద 20 కార్పొరేషన్లు, బీసీ ‘ఈ’ కింద రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది
* బీసీ బిడ్డకు పుట్టినందుకు గర్వంగా ఉంది
* అన్న ఎన్టీఆర్ తోను బీసీలకు గుర్తింపు లభించింది
* ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేస్తున్నారు
* బీసీలు అంటేనే టీడీపీ... టీడీపీ అంటేనే బీసీలు