Entertainment5th Aug 11:19 AMSunil Byrisetty1 min read

టాలీవుడ్‌లో ఫెడరేషన్ Vs ప్రొడ్యూసర్స్

టాలీవుడ్‌లో ఎంప్లాయిస్ ఫెడరేషన్ Vs ప్రొడ్యూసర్స్ మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో అమీతుమీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. 30 శాతం వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు

టాలీవుడ్‌లో ఫెడరేషన్ Vs ప్రొడ్యూసర్స్
టాలీవుడ్‌లో ఎంప్లాయిస్ ఫెడరేషన్ Vs ప్రొడ్యూసర్స్ మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో అమీతుమీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. 30 శాతం వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆ స్థాయిలో పెంచడం అసాధ్యమని నిర్మాతలు తేల్చేశారు. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే.. షూటింగ్స్‌కి వస్తామని కార్మికులు స్పష్టంగా చెబుతున్నారు. మరోవైపు కార్మికుల బెదిరింపులకు భయపడమని ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రకటన విడుదల చేసింది. కొత్త వాళ్లతో షూటింగ్స్‌ చేస్తామని పేర్కొంటోంది. అదే నిర్ణయంతో ఇప్పటికే నిపుణులు, సిబ్బంది కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మరోవైపు ఫెడరేషన్ సభ్యులకు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ సంఘీభావం తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల కీలక భేటీ జరగనుంది. భేటీ తర్వాత నిర్మాతలు లేబర్‌ కమిషనర్‌ను కలవనున్నారు.
Tollywood Strike
Film Employees Federation
Producers vs Workers
Tollywood Wage Hike Demand
Telugu Film Industry News
Film Chamber Statement
తెలుగు ఫిలిం ఛాంబర్
షూటింగ్ బంద్
వినియోగదారుల కొత్త నియామకాలు
Scroll for the next article