Film News21st Apr 04:25 PMSunil Byrisetty1 min read
రూ. 200 కోట్ల క్లబ్‌లో రాజమౌళి.. IMDB సంచలనం
వరుస విజయాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఏం చేసినా సంచలనమే. ఒక్క ప్లాప్ కూడా లేని దర్శకుడిగా దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఆయన ఉంటారు. అయితే ఆయన ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారనేది సస్పెన్సే.
వరుస విజయాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఏం చేసినా సంచలనమే.
ఒక్క ప్లాప్ కూడా లేని దర్శకుడిగా దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఆయన ఉంటారు.
అయితే ఆయన ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారనేది సస్పెన్సే.
ఇటీవల దర్శకుల రెమ్యునరేషన్ల వివరాలు వెల్లడించిన ప్రముఖ సంస్థ IMDB రాజమౌళి సంపాదననూ వెల్లడించింది.
దేశంలో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ రాజమౌళి అని తెలిపింది.
ఒక్కో సినిమాకు దాదాపు రూ.200 కోట్ల వరకు రాజమౌళి తీసుకుంటున్నారట.
రెమ్యునరేషన్‌తోపాటు సినిమాలో ప్రాఫిట్స్ రూపంలో ఇది రాజమౌళికి వస్తోందని చెబుతోంది ఈ లెక్కన స్టార్ హీరోల కంటే స్టార్ డైరెక్టర్ రాజమౌళికే ఎక్కువ రెమ్యునరేషన్ అందుతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు తీసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది.
ఆ తర్వాత సుకుమార్, రాజ్ కుమార్ హిరానీ రూ.80 కోట్ల దాకా తీసుకుంటున్నారట.