News9th May 01:09 PMSunil Byrisetty1 min read

ఆపరేషన్ సిందూర్‌లో అమరుడైన జవాన్

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ వీర జవాన్ అమరుడయ్యారు. వీర జవాన్ మురళి నాయక్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ

ఆపరేషన్ సిందూర్‌లో అమరుడైన జవాన్
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ వీర జవాన్ అమరుడయ్యారు. వీర జవాన్ మురళి నాయక్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన వారు. పాక్‌తో యుద్ధంలో వీరోచితంగగా పోరాడటంపై దేశమంతా అశ్రునివాళులర్పిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. మురళి నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని, ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని పేర్కొన్నారు.
Andhra Pradesh
Operation Sindoor
IndianArmy
Telugu Jawan Martyred in Kashmir
జవాన్ మురళి నాయక్
వీర జవాన్ అమరుడయ్యారు
జవాన్ వీరమరణం
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం
Scroll for the next article