News16th Jul 05:16 PMSunil Byrisetty1 min read
కేంద్ర జలశక్తి శాఖ సీఎంల సమావేశంలో ఏపీ వాదనలు
కేంద్ర జలశక్తి శాఖ సీఎంల సమావేశంలో ఏపీ బలంగా వాదనలు వినిపించింది. పోలవరం-బనకచర్ల లక్ష్యాలు వివరించేలా సమగ్ర నివేదిక ఇవ్వనుంది. సముద్రంలో వృథాగా కలిసే జలాలనే వాడుకుంటామని చెప్పనుంది
కేంద్ర జలశక్తి శాఖ సీఎంల సమావేశంలో ఏపీ బలంగా వాదనలు వినిపించింది. పోలవరం-బనకచర్ల లక్ష్యాలు వివరించేలా సమగ్ర నివేదిక ఇవ్వనుంది. సముద్రంలో వృథాగా కలిసే జలాలనే వాడుకుంటామని చెప్పనుంది. గోదావరిలో వందేళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాలు వివరించడంతోపాటు ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని వివరించింది. బనకచర్ల ద్వారా గరిష్ఠంగా 200 టీఎంసీలే తరలిస్తామని చెప్పనుంది. దీనివల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండబోదని చెప్పనుంది. 11 ఏళ్లుగా తెలంగాణలో కట్టిన ఏ ప్రాజెక్టుకూ అభ్యంతరం చెప్పలేదని, ఇదే విషయంలో కేంద్ర జలశక్తి శాఖ భేటీలో చెప్పాలని నిర్ణయించింది.