News11th Aug 11:17 AMSunil Byrisetty1 min read
బ్యాంకాక్‌లో చిక్కుకున్న తెలుగువారు.. లోకేష్ భరోసా
బ్యాంకాక్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. థాయ్‌లాండ్‌లో తాము ఇబ్బంది పడుతున్నట్లు తెలుగు విద్యార్థులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో మోసపోయినట్లు
బ్యాంకాక్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. థాయ్‌లాండ్‌లో తాము ఇబ్బంది పడుతున్నట్లు తెలుగు విద్యార్థులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో మోసపోయినట్లు వివరించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో విద్యార్థులతో మాట్లాడిన ఏపీ భవన్ అధికారులు అవసరమైన చర్యలు ప్రారంభించారు. ఆ సమాచారాన్ని థాయ్‌లాండ్‌లోని భారత రాయబారికి తెలిపి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ఏపీ ప్రభుత్వం అందిస్తుందని, వీలైనంత త్వరగా విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి పంపాలని ఏపీ భవన్ కమిషనర్ కోరారు.