National30th Sep 12:20 PMSunil Byrisetty1 min read

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళకు కీలక పదవి

తెలుగు వారు దేశదేశాల్లో కీలక పదవుల్లో నియమితులవుతున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ మహానగర పరిధిలోని స్ట్రాత్‌ఫీల్డ్ మున్సిపల్ కౌన్సిల్ 73వ మేయర్‌గా సంధ్యా రెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూ

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళకు కీలక పదవి
తెలుగు వారు దేశదేశాల్లో కీలక పదవుల్లో నియమితులవుతున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ మహానగర పరిధిలోని స్ట్రాత్‌ఫీల్డ్ మున్సిపల్ కౌన్సిల్ 73వ మేయర్‌గా సంధ్యా రెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఆమె, తాజాగా కౌన్సిలర్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని అధిరోహించి సెప్టెంబరు 2028 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్‌లో లా విద్య పూర్తి చేసి 1991లో ఆస్ట్రేలియాకు వెళ్లిన సంధ్యా రెడ్డి, ఇమిగ్రేషన్ న్యాయవాదిగా స్థిరపడి సామాజిక, రాజకీయ రంగాల్లో గుర్తింపు పొందారు. 2021, 2024లలో స్థానిక ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచిన ఆమె, 2023లోనే స్ట్రాత్‌ఫీల్డ్‌కు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. విదేశీ గడ్డపై ఒక ప్రముఖ మున్సిపల్ కౌన్సిల్‌కు తెలుగు మూలాలున్న మహిళ నాయకత్వం వహించడం ఇండో-ఆస్ట్రేలియన్ కమ్యూనిటీతో పాటు తెలుగువారికి గర్వకారణం.
Scroll for the next article