News9th Nov 03:43 PMSunil Byrisetty1 min read
దాతల సహకారంతో ఆలయాల అభివృద్ధి
దాతల సహకారంతో ఆలయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలోని వెంకమ్మ పేరంటాల అమ్మవారి ఆలయానిక
దాతల సహకారంతో ఆలయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలోని వెంకమ్మ పేరంటాల అమ్మవారి ఆలయానికి నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఆదివారం ఆలయ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వెంకట్రావు చైర్మన్ పట్టపు వెంకటేశ్వరావుతోపాటు మరో 10 మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రధాన నాయకులు అందరూ చైర్మన్ పదవికి వెంకటేశ్వరరావు పేరును సూచించారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని నూతన పాలకవర్గ సభ్యులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలతో పోల్చుకుంటే గన్నవరం నియోజకవర్గానికి నామినేటెడ్ పదవుల పంపకంలో తీరని అన్యాయం జరిగిందని ఇకముందు ప్రభుత్వం నియమించే కమిటీల్లో గన్నవరం నియోజకవర్గానికి ఎక్కువ పదవులు వచ్చేలా ముఖ్యమంత్రితో మాట్లాడతానని కూటమి శ్రేణులకు భరోసా ఇచ్చారు.