News1st Nov 03:03 PMSunil Byrisetty1 min read

ఇలా జరుగుతుందనుకోలేదు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్‌ పండా స్పందించారు. కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట

ఇలా జరుగుతుందనుకోలేదు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్‌ పండా స్పందించారు. కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి.. 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో పండా మాట్లాడుతూ సాధారణంగా ఆలయానికి రెండు వేల మంది వరకు భక్తులు వస్తుంటారని, ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదని తెలిపారు. ‘‘ భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇంత మంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు’’ అని అన్నారు. ఆలయంలోనే హరిముకుంద్‌ పండాతో కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడారు. అనంతరం బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆలయ పరిసరాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
Andhra Pradesh
Kasibugga stampede
Srikakulam district
Venkateswara temple tragedy
Harimukund Panda
temple crowd accident
ఆలయ ప్రమాదం
పోలీసుల విచారణ
ఆలయ నిర్వహణ
భక్తుల రద్దీ
Scroll for the next article