News2nd May 01:05 PMSunil Byrisetty1 min read

ప్రధాని మోదీ పర్యటనకు గుడివాడ నుంచి పదివేల మంది

అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు గుడివాడ నియోజకవర్గం నుంచి పదివేల మంది కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొంటున్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ప్రధాని మోదీ పర్యటనకు గుడివాడ నుంచి పదివేల మంది
అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు గుడివాడ నియోజకవర్గం నుంచి పదివేల మంది కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొంటున్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలియజేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బస్సుల ర్యాలీలను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. సభలో పాల్గొని ప్రజలందరూ సురక్షితంగా ఇంటికి చేరేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము తెలియచేశారు. అనంతరం ప్రజలు కూటమి నాయకులతో కలిసి బస్సులోనే ప్రధాని మోదీ బహిరంగ సభకు ఎమ్మెల్యే రాము బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రాము బస్సులోనే భోజనం చేశారు.
Amaravati
Prime Minister Modi
Ten Thousands of people from Gudivada
MLA Ramu
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
నరేంద్ర మోదీ పర్యటనకు గుడివాడ నియోజకవర్గం
Scroll for the next article