News1st Apr 09:36 AMSunil Byrisetty1 min read
ఆ భూములు ఎవరివి? హెచ్సీయూలో ఉద్రిక్తత!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవని చెబుతున్న భూములపై రగడ కొనసాగుతోంది. ఒకవైపు వర్సిటీ విద్యార్థులు ఆ భూములను ప్రభుత్వం తీసుకుంటే ఊరుకోబోమని హెచ్చరిస్తు్న్నారు. తవ్వకాలు ప్రారంభించిన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవని చెబుతున్న భూములపై రగడ కొనసాగుతోంది.
ఒకవైపు వర్సిటీ విద్యార్థులు ఆ భూములను ప్రభుత్వం తీసుకుంటే ఊరుకోబోమని హెచ్చరిస్తు్న్నారు.
తవ్వకాలు ప్రారంభించిన జేసీబీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూములు లేవంది.
అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో చెరువు లేదని, న్యాయ పోరాటం ద్వారా భూమిని దక్కించుకున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
దీనిపై స్పందించిన హెచ్సీయూ TGIIC చేసిన ప్రకటనను ఖండించింది.
రెవెన్యూ అధికారులు జూలై 2024లో HCU ప్రాంగణంలోని 400 ఎకరాలలో ఎటువంటి సర్వే నిర్వహించలేదని తేల్చి చెప్పింది.
ఇప్పటివరకు భూమికి చెందిన స్థలాకృతిని మాత్రమే ప్రాథమికంగా తనిఖీ మాత్రమే చేయబడిందని పేర్కొంది.
తమ వివరణ తీసుకోకుండా తప్పుడు వార్తలు రాయవద్దని మీడియాకి సూచించింది.
మొత్తంగా హెచ్సీయూ వివాదం కొనసాగుతూనే ఉంది.